ముంబై సమీపంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ రిగ్ సాగర్ కిరణ్ వద్ద హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ విఫలమైన ఘటనలో నలుగురు మరణించినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. తొమ్మిది మందిని రక్షించి ఆసుపత్రికి తరలించగా, వారిలో నలుగురు ముంబై నానావతి ఆసుపత్రిలో మరణించారు. మరో ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మృతులను ముఖేష్ పటేల్, విజయ్ మాండ్లాయ్, సత్యంబాద్ పాత్రో, సంజు ఫ్రాన్సిస్లుగా గుర్తించారు.