డబ్లిన్ వేదికగా మంగళవారం రాత్రి ఐర్లాండ్‌తో జరిగిన టీ20లో మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ 3 వికెట్లు తీశాడు. జాష్, క్రెయిగ్ యంగ్ చెరో రెండు వికెట్లు తీశారు. అయితే 226 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.