సత్తెనపల్లి పట్టణం మార్కెట్ యార్డులో మూడో విడత ప్రారంభ కార్యక్రమంలో మంగళవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు.
అంబటి మాట్లాడుతూ అమ్మఒడి ద్వారా పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.