రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఈక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా బదిలీలు కావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా కృష్ణాజిల్లా , ఎన్ . టీ . ఆర్ . జిల్లా , ఏలూరు జిల్లాల కలెక్టర్ల కమిటీ కలెక్టరేట్ లో సమావేశమయ్యారు. ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగా ఉమ్మిడి కృష్ణాజిల్లా పరిధిలో తహశీల్దార్లు క్రిందస్థాయి రెవెన్యూ ఉద్యోగుల, ఇతరకార్యాలయాల సిబ్బంది బదిలీలకు సంబంధించి పలుఅంశాలపై కమిటీ పరిశీలించారు. ఈ సమావేశంలో కృష్ణాజిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా , ఎన్ . టీ . ఆర్ . జిల్లా కలెక్టర్ ఎస్ . ఢిల్లీ రావు , ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి . అరుణ్ బాబు , కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల, మూడు జిల్లాల జిల్లా రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.