బుధవారం కోస్తాలో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కూడా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.22 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.35 గంటలకు కానుంది.