ఒలిపింక్ పతక విజేత భారత హాకీ జట్టు దిగ్గజ ప్లేయర్ వారిందర్ సింగ్ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన స్వస్థలం జలంధర్ లోని సొంత ఇంటిలో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
1975లో కౌలాలంపూర్ ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడు. వారిందర్ మృతి పట్ల హాకీ ఇండియా సంతాపం ప్రకటించింది.