హరియాణాలో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన జరిగింది. పానిపట్ లోని ఓ ప్రసూతి ఆసుపత్రిలో సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా బెడ్‌పై తల్లి పక్కన ఉన్న 3 రోజుల శిశువును కుక్క నోట కరుచుకొని ఎత్తుకెళ్లింది.
తెల్లవారుజామున 2 గంటలకు గమనించిన తల్లి, సిబ్బంది, బంధువులు చుట్టుపక్కల ప్రాంతంలో వెతికారు. హాస్పిటల్ సమీపంలో ఓ కుక్క శిశువును నోట కరుచుకొని ఉండటాన్ని గుర్తించారు. అయితే అప్పటికే గాయాలతో చనిపోయిందని వైద్యులు తెలిపారు.