చాలా మందికి తెలియక మొక్కజొన్న పీచులను పడేస్తుంటారు. కానీ పీచుతో చాలా లాభాలు ఉన్నాయి.మొక్కజొన్న పీచులో పొటాషియం, క్యాల్షియం, విటమిన్ బి, సి, కే వంటి పోషకాలున్నాయి. పీచుతో టీ చేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరిగి బాడీలో అవయవాలు పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉన్న అదనపు నీరును,వ్యర్ధాలను తొలగిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా పీచు సహాయపడుతుంది. రక్తపోటు సమస్య ఉన్నవారికీ ఈ టీ చాల మంచిది.