మెక్సికోకు చెందిన జువాన్, లుజ్ దంపతులది ప్రేమ వివాహం. వీరికి పెళ్లై పదేళ్లవుతోంది. వీరికి ముగ్గురు పిల్లలు. 2009లో కార్లు కడిగే షాప్ బయట జువాన్ ను లుజ్ చూసింది. నిరాశ్రయుడైన జువాన్ రోడ్లపైనే నిద్రించేవాడు.
కానీ అతడి మాట తీరు లుజ్‌ను ఆకట్టుకుంది. దీంతో లుజ్ అతనికి హెయిర్‌కట్ చేయించింది. ఆ తర్వాత అతడి లుక్ అందంగా మారింది. లుజ్ అతడితో ప్రేమలో పడింది. ఇంట్లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది.