దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 416.07 పాయింట్లు నష్టపోయి 52,761.38 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 125.30 పాయింట్లు నష్టపోయి 15,724.90 వద్ద కొనసాగుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.78.95 గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ 30 లోని అన్ని షేర్లు నష్టాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, టాటాస్టీల్, మారుతీ, రిలయన్స్ ఎక్కువగా నష్టపోతున్న షేర్లలో ఉన్నాయి.