సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ వేసింది. బలపరీక్ష పై గవర్నర్ ఆదేశాలు సవాల్ చేస్తూ వారు పిటిషన్ వేశారు. దీని పై జస్టిస్ సూర్యకాంత్, పర్దివాలా విచారణ జరపనున్నారు. గురువారం సాయంత్రంలోగా బలపరీక్ష ద్వారా బలనిరూపణ చేసుకోవాలని ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. దీని పై శివసేన పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు దీని పై ఏ విధంగా తీర్పు చెప్పనుందో చూడాలి.