అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ 8 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. రోడెరిక్ రాండాల్ అనే వ్యక్తికి గన్ ఉంది. అతడు తన కొడుకుతో కలిసి తన స్నేహితురాలిని కలిశాడు. ఆమె తన కూతురితో అక్కడకు వచ్చింది. వాళ్లంతా కాసేపు ఆనందంగా గడిపారు. ఆ తర్వాత రాండల్ బయటకి వెళ్లగా, అతని కొడుకు అలమరాలోని గన్ ని బయటకి తీసి ఆడుకుంటూ కాల్పులు జరిపాడు. దీంతో చిన్నారికి బుల్లెట్ తగిలి చనిపోయింది.