రాజస్థాన్ ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీని పై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. ఐసిస్ ఉగ్రకోణం దిశగా విచారణ సాగుతుంది.
నుపూర్ శర్మ ఫోటోను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడని ఇద్దరు యువకులు టైలర్ కన్హయ్యను దారుణంగా హత్య చేశారు. దీని పై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో కేంద్రం ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది.