కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని బెంగళూరులో కేసులు పెరుగుతుండటంతో మాస్కును తప్పనిసరి చేయడానికి బీబీఎంపీ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రతి రోజూ కూడా 17 వేల మందికిపైనే కరోనా పరీక్షలు చేపట్టగా అందులో కనీసం 600 నుంచి 700 వరకూ కేసులు నమోదవుతున్నాయని బీబీఎంపీ స్పెషల్ కమిషనర్ త్రిలోక్ చంద్ర వెల్లడించారు. అందరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని కోరారు.