ప్రజలకు పారదర్శకంగా సంక్షేమాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థ ఏర్పరచారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో మంత్రి క్యాంపు కార్యాలయంలో తణుకు మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరిస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. ఓకేసారి ఇంత మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దేశచరిత్రలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు. ఏ లక్ష్యంతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయబడిందో దానికి కట్టుబడి ఉద్యోగులంతా ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు.