కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ జూలై 1న వాయనాడ్‌లోని తన నియోజకవర్గాన్ని సందర్శించనున్నారు. సీపీఐ(ఎం) విద్యార్థి విభాగం అయిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)కి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక కార్యక్రమాలు, సమావేశాలకు హాజరైన అనంతరం గాంధీ జూలై 3న తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 5 గంటలకు సుల్తాన్ బతేరిలోని గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ర్యాలీ, నిరసన సభను గాంధీ ప్రారంభించనున్నారు.