నిత్యం కొబ్బరినూనెను చర్మానికి రాసుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లినోలెయిక్ యాసిడ్ మరియు విటమిన్ ఎఫ్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పొడి చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మార్చుతుంది.