ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో పనికి వెళుతుండగా హైటెన్షన్ వైర్లు తగిలి 8 మంది సజీవదహనం ఐనట్లు వచ్చిన వార్తలపై టీడీపీ నాయకులూ పరిటాల శ్రీరామ్ స్పందిస్తూ.... ఇలా అవడం చాలా బాధాకరం. ఇలాంటి కష్ట సమయాల్లో ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని, మృతి చెందిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని తెలియజేసారు.