గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామవాసి, టిడిపి కార్యకర్త, వెంకటేష్ ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు. వెంకటేష్ ఇంట్లోకి చొరబడి వైసీపీ అల్లరి మూకలు, పోలీస్ వారి సహకారంతో దాడి చేసి మరల అతనినే అరెస్ట్ చేసారని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కనపడకుండా ఉండటానికి లైట్లు పగలగొట్టినా మీ మొఖాలన్నీ స్పష్టంగా వీడియోలో రికార్డ్ అయ్యాయి. జగన్ రెడ్డి ప్రాపకం కోసం చట్టాన్ని అతిక్రమించి అడ్డదారులు తొక్కుతున్న వారంతా మూల్యం చెల్లించుకోక తప్పదు. మీడియాని చూస్తే భయం, సోషల్ మీడియా అంటే వణుకు, చివరికి యూట్యూబ్ ఛానెల్ థంబ్ నైల్ చూసి జడుసుకునే జగన్ రెడ్డి సింగిల్ గా వచ్చే సింహమా! వీధి కుక్క కూడా కాదు. ఈ మాదిరి పిరికోడికి నా వెంట్రుక పీకలేరంటూ పిల్లల ముందు బిల్డప్ ఎందుకు? కనీసం ఐడెంటిటీ లేకుండా అర్ధరాత్రి దొంగల్లా గోడ దూకడం, గునపాలతో తలుపులు పగలగొట్టిన కొంతమంది పోలీసులు వైసిపి గూండాలను మించిపోయారు అని ఆవేదన వ్యక్తపరిచారు.