పల్నాడు జిల్లా, వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినుకొండ కొండపై వేంచేసిన రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో జులై 10వ తేదీన నిర్వహించే తొలి ఏకాదశి వేడుకలకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ తెలియజేసారు. 29.06.2022 న పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ లతోటి.శివశంకర్ ఐఏఎస్ గారు,స్థానిక వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా.బ్రహ్మ నాయుడు గారు మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి తొలి ఏకాదశి తిరునాళ్ళకు సంబంధించి కొండపై జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించి, పర్యవేక్షించినారు.