చంద్రబాబు రావాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని గజపతినగరం మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. గురువారం గజపతినగరం మండలంలోని పాతబగ్గాం గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుడు అట్టాడ లక్ష్మ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారని అన్నారు. విద్యుత్. చార్జీలు నూటికి నూరు శాతం పెరగ్గా నిత్యావసర వస్తువుల ధరలు నూటికి నూట యాభై శాతం పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, సీనియర్ నాయకులు పి. వి. వి గోపాలరాజు, టిడిపి నాయకులు బి. రాంజీ, లెంక బంగారు నాయుడు, బి. గౌరీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.