వేమూరు నియోజకవర్గ ప్లీనరీ సమావేశం బుధవారం ఘనంగా నిర్వహించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను తలెత్తుకునేలా చేసింది వైయస్ జగన్ మోహన్ రెడ్డి వారి గుండెల్లో నిలిచేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. జనం కోసం పరితపించే నాయకుడు వైయస్ జగన్ ఒక్కరేనని.. ఆయనకు ఎవరూ సాటి రారని కొనియాడారు. ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయకుండా పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రకటించి వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు .ఈ మూడేళ్ళలో లక్షా 71 వేల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసాడని పేర్కొన్నారు.