భారత షట్లర్ పీవీ సింధు మలేషియా ఓపెన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది. గురువారం థాయిలాండ్ క్రీడాకారిణి ఫిట్టయాపోర్న్ చైవాన్ ను సింధూ ఓడించింది. 19-21, 21-9, 21-14 తేడాతో గెలిచింది. క్వార్టర్స్‌లో తై జూ యింగ్ తో సింధు తలపడనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ లో ప్రణయ్ చైనీస్ తైపీకి చెందిన చౌ తియన్ చెన్ ను ఓడించాడు. 21-15, 21-17 తేడాతో ప్రణయ్ గెలుపొందాడు.