టీమిండియా సారధి రోహిత్ శర్మ ఇటీవల కరోనా బారిన పడగా, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్తితి గురించి ఎటువంటి సమాచారం రాలేదు. అందువల్ల రోహిత్ ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్ట్ మ్యాచ్ ఆడటం అనుమానంగానే కనిపిస్తుంది. దీంతో ఓపెనర్ ఎవరనే విషయంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కసరత్తులు చేస్తున్నారు. ఒకవేళ మయాంక్, రోహిత్ ఆడని పరిస్థితి ఉంటే మాత్రం తెలుగు తేజం కేఎస్ భరత్ అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.