రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలపై జరిగే నేరాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ దాఖలులో ఆలస్యం చేయకూడదని సూచించింది. ఈ కేసుల దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని చెప్పింది. సాక్షులు కోర్టుకు అందుబాటులో ఉండేలా చూడాలని, వారికి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలను ఆదేశించింది. ఇలా చేస్తే కేసుల విచారణను వేగవంతం చేయొచ్చని పేర్కొంది.