గురువారం ఉదయం శ్రీ సత్యసాయి జిల్లా , ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద హైటెన్షన్ విద్యుత్ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయం తెలిసి ఎంతో మంది నాయకులూ తీవ్ర ఆవేదన వ్యక్త పరిచారు. అలానే జనసేన నాయకులూ పవన్ కళ్యాణ్ ఇందుకు గల కారణాలు ఏమిటో తెలుసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలానే ఇది తెలిసిన సీఎం జగన్ నష్ట పరిహారంగా ఒక్కొక్కరికి 10 లక్షలు ఆర్ధిక పరిహారం ప్రకటించారు. ఐతే దీని మీద స్పందించిన విద్యుత్ శాఖ వారు చెప్పిన సమాధానం కి ప్రజలకి మైండ్ తిరిగిందని చెప్పుకోవాలి. తెగిపడిపోయినది హైవోల్టాజ్ లైన్ కాగా, అది తెగడానికి ఒక ఉడుత కారణమని తెలియజేయడం జరిగింది. నిజంగానే ఉడత చేసిన పనేనా కదా అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలి.