హోళగుంద సమీపంలో ఎల్ ఎల్ సి పై నిర్మించిన ఫుట్ బ్రిడ్జి కి వెంటనే మరమ్మతు చేయాలని గ్రామస్థులు గురువారం డిమాండ్ చేశారు. ఫుట్ బ్రిడ్జి మధ్య భాగంలో పెద్ద రంధ్రం పడి దెబ్బతిందని, దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ప్రజలు తెలిపారు.
ఈ బిడ్జిపైనే హొళగుంద నుండి ముద్దటమాగి గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నారు. అలాగే రైతులు, రైతు కూలీలు కూడా ఇదే బ్రిడ్జిపైనే నడుస్తున్నారు.