కర్నూలు నగరంలోని బిర్లా గేటు సమీపంలో గల శ్రీలక్ష్మీ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జరగబోవు వైసిపి జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు.
గురువారం ఆయన ఆలూరులో మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిల్లో వైసిపి ప్లీనరీ సమావేశాలు జరిగిన అనంతరం జిల్లా స్థాయిలో ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.