పుట్టపర్తి సెబ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెనుకొండ పట్టణ సమీపంలోని ఆర్టిఓ చెక్ పోస్ట్ వద్ద వాహనముల తనిఖీ నిర్వహించి కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గురువారం షిఫ్ట్ డిజైర్ కారులో కర్ణాటకకు చెందిన 29 బాక్సుల మద్యంను అనంతపురంకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తుండగా వారిని అరెస్టు చేసి, కారుతో సహా మద్యంను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సెబ్ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు.