రాష్ట్రం పరిశ్రమలతోనే అభివృద్ధి చెందుతుందని రాయచోటి ఎమ్మెల్యే, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం గాలివీడు మండలం అరవీడు గ్రామం కుషావతి ప్రాజెక్టు వద్ద రైతులకు సంబంధించిన ముంబైకు చెందిన ఎంసిఎల్ పారిశ్రామిక వేత్త జిసిఎల్ వ్యవస్థాపకుడు అహ్మద్ చే రూ 50 కోట్ల నుంచి రూ 500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే పరిశ్రమ ఏర్పాటు సందర్భంగా ఆయన స్థానిక మండల నాయకులు, ఎంసిఎల్ ప్రతినిధులతో పాల్గొని శిలావిష్కరణ, రైతుల సమావేశంలో మాట్లాడి భూమి పూజ చేసి మొక్కను నాటారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో రాయచోటి నియోజకవర్గంలో చిన్నచిన్న పరిశ్రమలు రావడం శుభపరినామమని, ఈ పరిశ్రమ ద్వారా రైతులకు ఉపాధితోపాటు పలువురికి ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు.
ఈ సంస్థద్వారా స్థిరమైన జీవనాల ఇంధనాల ఉత్పత్తికోసం వివిధ రకాల వ్యర్థాలను ఉపయోగించి రసాయనిక ఎరువులను తయారీ చేయడం, కార్బన్ ప్రతికూల అభివృద్ధికోసం బహుళ ప్రాజెక్టులు నిర్మించి జీవన ఇంధనాలు తయారు చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని, ముంబై శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు తీసుకొని ఈ ప్రాంతంలో రైతులు అభివృద్ధి చెందాలని తెలియజేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అనేక పరిశ్రమలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిబాటలో ప్రయాణిస్తుందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు.
అనంతరం ఈ సమస్య రావడానికి అరవీడుకు చెందిన పారిశ్రామికవేత్త జిసిఎల్ వ్యవస్థాపకుడు అహ్మద్ ను అభినందించారు. ఈ సంస్థ దాదాపు అరవీడుకు సౌత్ సమీపంలో 10ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపిపి జిల్లా సుదర్శన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆవుల నాగభూషణ్ రెడ్డి, ఉపాధ్యక్షులు యదభూషన్ రెడ్డి, జడ్పీటిసి కుమారుడు ఖాదర్ మొహిద్దీన్, కాపు నాయకుడు వేణుగోపాల్, సర్పంచ్ ఉమాపతి రెడ్డి, చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.