రైల్వే కోడూరు నియోజకవర్గం లోని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ ను అన్నమయ్య జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించారు.
అనంతరం నలుమూలలా గమనించి చుట్టుపక్కల శుభ్రత పాటించి, వచ్చిన ప్రజలకు పోలీస్ అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చాలన్నారు. నియోజకవర్గం పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్, మండల పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.