తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్య పాలెంకు చెందిన వైసీపీ నాయకుడు వెంకటేశులు నాయుడు గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు.
ఆయనను శ్రీసీటీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందారు. ఆయన అకాల మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయాన్ని చూడటానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు తరలివచ్చారు.