ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరకొర సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అదే అభివృద్ధిగా ప్రచారం చేస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 11:33 AM

వైసీపీ దుర్మార్గపు పాలనకు రాష్ట్ర ప్రజలు చరమ గీతం పాడాలని పల్నాడు జిల్లా, నరసరావుపేట టీడీపీ ఇంచాగే చదలవాడ అరవింద్ బాబు  పిలుపునివ్వడం జరిగింది. నియోజకవర్గ పరిశీలకులు మనుకొండ శివప్రసాద్ మరియు టీడీపీ నాయకులు,  వైసీపీ ప్రభుత్వ మోసపూరిత విధానాలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నరసరావుపేట మండలం గోనేపూడి గ్రామంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆయన  పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... టీడీపీ ప్రభుత్వ పాలనలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆయా పథకాలను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆపేసిందో వివరించాను. వైసీపీ ప్రభుత్వం అరకొర సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అదే అభివృద్ధిగా ప్రచారం చేసుకుంటుంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చెత్త పై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం.నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల్ని తాకుతున్నా ధరల నియంత్రణకు కనీస చర్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టడం లేదు అని తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com