ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికం తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చే భక్తుల వద్ద నుంచి వసతి గృహాల అద్దె కోసం వసూలు చేస్తున్న "రిఫండబుల్ డిపాజిట్"లో అద్దె జమ చేసుకోగా మిగిలిన సొమ్ము తిరిగి వారికి చెల్లించట్లేదని, అదేంటి అని అడిగిన వారిని మీ బ్యాంక్ ఖాతాకు పంపుతామని చెప్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జనసేన నాయకులూ నాగబాబు చెప్పారు. దేవుడిపై భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులు "రిఫండబుల్ డిపాజిట్" లో అద్దెపోగా తమకు రావాల్సిన సొమ్ము ఒకటి, రెండు సార్లు అడిగినా ప్రయోజనం లేకుండా పోతోందని వాపోతున్నట్లు తెలిపారు. ఈ సొమ్ములు ఏం చేస్తున్నారో టీటీడీ ఉన్న తాధికారులు సమాధానం చెప్పాలి అన్నారు.