గన్నవరం నియోజకవర్గ వైయస్‌ఆర్ సీపీ ప్లీనరీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేష్, కొడాలి నాని, పేర్ని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. గన్నవరంలో టీడీపీకి తాడూ, బొంగరం లేదని ఎద్దేవా చేశారు. పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సీఎం వైయస్ జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే.. చంద్రబాబు బ్యాచ్ నానా రాద్ధాంతం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పిల్లలు ఎక్కడ చదివారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబం, అభిమానుల సానుభూతి కోసమే చంద్రబాబు ఏడుపు మొదలుపెట్టాడని, అవసరమైతే కాళ్లు పట్టుకుంటాడని, అవసరం తీరాక వెన్నుపోటు పొడుస్తాడని కొడాలి నాని అన్నారు.