భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ఐదో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. బర్మింగ్ హామ్ వేదికగా మ.3 గంటల నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. కరోనా కారణంగా ఈ మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. టీమిండియా కెప్టెన్ గా బుమ్రా, వైస్ కెప్టెన్ గా పంత్ వ్యవహరించనున్నారు. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. గతేడాది కరోనా కారణంగా రద్దైన ఐదో టెస్టును ఇప్పుడు రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే.