ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రభుత్వం మరోసారి సత్తా చూపింది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్–2020 లో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిల్చింది.ఇందులో టాప్ అచీవర్స్‌లో ఏడు రాష్ట్రాలను గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో నిల్చింది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ తర్వాత గుజరాత్, హరియాణ, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయి. ఏపీ 97.89 శాతం స్కోర్ పొందగా, రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌ది 97.77 శాతం స్కోర్ కాగా, తెలంగాణ 94.86 శాతం స్కోర్ పొందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త విధానాలతో ర్యాంకింగ్ ప్రక్రియ కొనసాగింది. పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు, స్టాక్ హోల్డర్ల నుంచి అభిప్రాయం సేకరించారు.