రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలకు అవసరమైన సహకారం, టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ విషయంలో ఎక్కడా రాజీ పడబోము అని మంత్రి గుడివాడ అమర్నాధ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... వెనక్కు తగ్గబోము. ఇక నుంచి ప్రతి నెల పలు పరిశ్రమల ప్రారంభోత్సవం జరుగుతాయి . భూమి పూజలు జరిపే విధంగా క్యాలెండర్ రూపొందిస్తున్నాం. మనకు విశాల సముద్ర తీరం ఉంది. దాదాపు 974 కి.మీ తీరం ఉంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది యోచన. అందుకే కొత్తగా రామయ్యపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులతో పాటు, 9 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో నాలుగింటి పనులుల మొదుల కాగా, మిగిలిన వాటికి అనుమతులు వచ్చాయి. ఆ విధంగా ప్రతి 50 కి.మీ.కు ఒక యాక్టివిటీ ఉండే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపుతోంది అని తెలియజేసారు.