ఈ బిజీ బిజీ లైఫ్‌లో ఎంతోమందికి కంటి నిండా నిద్ర కరువవుతోంది. అయితే, గుండె, మెదడు ఆరోగ్యవంతంగా పనిచేయడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుందని అమెరికన్ హార్ట్ అసోషియేషన్ బుధవారం ప్రచురించిన తన జర్నల్‌లో అధికారికంగా స్పష్టం చేసింది. కనీసం 7 గంటలు నిద్రపోవడం హార్ట్‌కి మంచిదని పేర్కొంది. ప్రతి రోజూ రాత్రి 7-9 గంటలు సరిపడా నిద్రపోవాలని, ఐదేండ్ల లోపు చిన్నారులకు 10-16 గంటల నిద్రను సిఫారసు చేసింది.