అల్లం.. వంటింట్లో దొరికే దివ్య ఔషధాల్లో ఒకటి. అల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలోని చక్కెర శాతాన్ని అల్లం తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లంకు ఉంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మినరల్స్, బి3,బి6, సి-విటమిన్, పాస్ఫరస్, జింక్, పొటాషియం, ఐరన్.. ఇలా 400కి పైగా ఉపయోగకరమైన కాంపౌండ్స్ అల్లంలో ఉంటాయి. అలాగని రోజూ తీసుకుంటే మాత్రం ఇబ్బందే.. కడుపులో మంట పుడుతుంది.