తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మొత్తం 31 కంపార్టు మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న శ్రీవారిని 65,898 మంది భక్తులు దర్శించుకోగా 33,686 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.66 కోట్లు వచ్చిందని తెలిపారు.