తెలుగు పలుకుకు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు రూపం వెంకయ్యనాయుడు. ఆత్మీయులు వెంకయ్య నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు అని టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏ పదవిలో ఉన్నా ప్రజాసేవను, ప్రజాస్వామ్య విలువలను మరువని మీరు... ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను సుఖసంతోషాలతో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అని తెలియజేసారు. అలానే మాజీ మంత్రి ప్రతి పాటి పుల్లారావు కూడా మిత్రులు, సదా తెలుగుప్రజల శ్రేయోభిలాషులు, తెలుగు భాషాభిమానులు అయిన గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను అని ట్వీట్ చేసారు.