తమిళనాడుకు చెందిన అవినాష్, దీపిక(28) దంపతులు కేరళలోని పాలక్కడ్‌లో ఉంటున్నారు. వీరికి ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు. అవినాష్ మొదటి భార్యకు విడాకులిచ్చి దీపికను రెండో పెళ్లి చేసుకున్నాడు.
అయితే గత మంగళవారం బ్రష్ చేయకుండానే కొడుక్కి ముద్దు పెడుతున్న అవినాశ్ ను భార్య దీపిక అడ్డుకుంది. బ్రష్ చేయకుండా కొడుక్కి ముద్దు పెట్టొద్దని చెప్పింది. దీంతో అవినాష్ కోపంలో కత్తితో దాడి చేసీ భార్యను చంపేశాడు.