భారత్‌లో ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, రోడ్డు భద్రతా చర్యలను మరింత మెరుగుపరచడంతో సుమారు 30 వేల మందిని కాపాడవచ్చని ప్రముఖ ఇంటర్నేషన్ జర్నల్ 'ది లాన్సెట్' తన నివేదికలో తెలిపింది.
ఒక్క అతివేగాన్ని అరికట్టడం ద్వారానే ఏటా 20,554 మంది ప్రాణాలు, హెల్మెట్‌లను తప్పనిసరి చేయడం వల్ల 5,683, సీటు బెల్టు ఉపయోగించడం వల్ల 3,204 మంది ప్రాణాలను రక్షించుకోవచ్చని పేర్కొంది.