నంద్యాల జిల్లా వైయస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం నంద్యాలలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ప్లీనరీ పరిశీలకుడు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, తొగూరు ఆర్థర్, శిల్పా చక్రపాణిరెడ్డిలు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.