విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలో జరిగిన జిల్లా ప్లీనరీలో వైయస్ఆర్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజని హాజరయ్యారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తొలి తీర్మానం ప్రవేశపెట్టారు. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.