చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రానున్న ఎన్నికల్లో కుప్పం నుంచి భరత్ పోటీ చేస్తారని, ఆ స్థానాన్ని గెలిచి తీరతామని ఆయన స్పష్టం చేశారు. కుప్పం అభ్యర్థి విషయంలో తమిళ నటుడితో మంతనాలంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్, పరిశీలకుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు వెంకటే గౌడ, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఆరణి శ్రీనివాసులు, ఎంఎస్ బాబు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.