కుల మత వర్గాలకు అతీతమైన, సమ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగుదేశం పుట్టిందన్న ఎన్టీఆర్... బడుగులకు రాజ్యాధికారం పంచారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ప్రతి గిరిజనుడికీ కనీస అటవీ హక్కులు, అందుబాటులో వైద్యం వంటి 14 చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేశారు. శకపురుషుడు "ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం" సందర్భంగా ఆ మహానుభావుని ఆశయాలను స్మరించుకుంటూ... తెలుగుదేశం శ్రేణులకు అందరికి శుభాకాంక్షలు అని పార్టీ నాయకత్వం తెలియజేసింది.