ఏపీలోని నంద్యాల జిల్లా పాణ్యానికి చెందిన షేక్ జవహర్ హుస్సేన్, హసీనా భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. జవహర్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్. ఇక మహబూబ్ బాషా అనే వ్యక్తితో హసీనాకు ఎఫైర్ ఏర్పడింది.
దీనిని ప్రశ్నించడంతో భర్తను చంపేయాలని నిశ్చయించుకుంది. తమ్ముడు ఇద్రూస్, ప్రియుడు మహబూబ్ బాషాతో కలిసి పక్కా ప్లాన్‌తో జూన్ 13న హతమార్చింది. పోస్టుమార్టంలో హత్య తేలడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.