పవర్ కట్‌పై జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. పాకిస్తాన్ లక్కీ మార్వాట్ జిల్లాలోని ఈసాక్ ఖేల్ ప్రాంతంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనలు ముగిశాయి. ఆ తర్వాత అక్కడ విద్యుత్‌కోతలపై రెండు వర్గాల మధ్య వాగ్వాదం చివరికి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో కొందరు తమ వద్దనున్న తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 11 మంది గాయపడ్డారు.